25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా దోస్తుల గాజుల ఉత్సవం

Must read

📰 Generate e-Paper Clip

  • కుప్పకంటి రాజేషుని సన్నిధిలో స్నేహితుల వేడుక

 

భీమ్ గల్, బతుకమ్మ : వేల్పూర్ మండలం రామన్నపేట్ కు చెందిన మహిళా మిత్ర బృందం మంగళవారం కుప్పకంటి శ్రీ రాజరాజేశ్వరుని సన్నిధిలో స్నేహితుల గాజుల ఉత్సవంను ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాలో గత కొద్దీ రోజులుగా జరుగుతున్న మహిళా స్నేహితుల గాజులు కార్యక్రమం లో భాగంగా రామన్నపేట్ కంకణాల అనురాధ ఆధ్వర్యంలో గాజులు వేసుకొనే కార్యక్రమం ను శ్రీ రాజేషుని సన్నిధిలో జరుపుకొన్నారు. ఇందులో భాగంగా స్వామి సన్నిధిలో వంటలు చేసి స్వామి వారికి  ప్రత్యేక పూజలను నిర్వహించి నైవేద్యం నివేదించి హారతినిచ్చారు. అనంతరం ఈ మహిళా స్నేహితులు ఒకరినొకరు గోరింటాకు పెట్టుకొని ఒకరినొకరు గాజులు వేసుకొన్నారు.

A grand celebration of friends' bangles

తదనంతరం సహా పంక్తి భోజనాలు చేసి ఆట, పాటలతో ఉల్లాసంగా గడిపారు. స్నేహితులు కలిసి సెల్ఫీలు, ఫోటోలు, వీడియోస్, రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ హల్చల్ చేశారు. ఈ కార్యక్రమం లో  నాగుల (గాండ్ల) లక్ష్మిగంగాధర్, శేరి లక్ష్మీ సత్యనారాయణ, శేరి లక్ష్మీ గంగాధర్, శేరి జ్యోతి కిషన్, నాగుల రజిత గంగాధర్, పందెన రాధికస్వామి, పిప్పెర జమున లింబాద్రి, శేరి లక్ష్మీ కాశీరాం, మేడపు విజయ చిన్న నర్సయ్య, వెన్న మమత కిషన్, కర్రోళ్ల కుర్మ భోజమ్మ తదితరులు పాల్గొన్నారు.

A grand celebration of friends' bangles

More articles

Latest article