25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అవధాన ప్రక్రియ పరిచయంపై అతిథి ఉపన్యాసం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కొరవి గోపరాజు  తెలుగు విభాగం ఆధ్వర్యంలో  “అవధాన ప్రక్రియ పరిచయం” అనే అంశంపై మంగళవారం అతిథి ఉపన్యాసం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి  మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాలలోని వారు పద్యరచనలతో పాటు  గణితం, రసాయన శాస్త్ర అంశాలను కూడా  తమ ప్రతిభ చేత పద్యాలలో వెల్లడిస్తున్నారని అన్నారు. వయసుతో సంబంధం లేకుండా సాహిత్య కృషి చేసి కేంద్ర స్థాయి  అవార్డులు  అందుకుంటున్నారని, వారి రచనలు వివిధ విద్యా సంస్థల్లో పాఠ్యాంశంగా పెడుతున్నారు. ఆవిధంగా విద్యార్థులు  మీ సామర్థ్యాలు మెరుగు దిద్దుకోవాలని  అన్నారు.  కార్యక్రమ ముఖ్య వక్త, యువ అవధాని బాణావత్ నితిన్ “అవధాన ప్రక్రియ పరిచయం” అనే అంశంపై విస్తృతోపన్యాసం చేశారు. అవధానం తెలుగు భాషకు సంబంధించిన విశిష్టత, ప్రత్యేకత అని, ప్రస్తుతం ఈ ప్రక్రియలో  యువకులు కొద్దిమంది   కృషి చేస్తున్నారని అన్నారు. అవధానంలోని మౌలికమైన అంశాలు,  లక్షణాలు, అవధానం చేసే విధానాలు,  అవధానంలోని అంశాలను ఉదహరిస్తూ విద్యార్థులకు చక్కటి అవగాహనను కలిగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల  వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, తెలుగు విభాగాధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, పీఆర్.ఓ. డాక్టర్  దండుస్వామి, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, అదనపు పరీక్షలు నియంత్రణ అధికారి వినయ్ కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్  నహేద బేగం, కార్యక్రమ నిర్వాహకుడు ఆర్. రాజేశ్వర్  తెలుగు అధ్యాపకులు కె.గంగాధర్, డాక్టర్  శ్రీనివాస్, డాక్టర్ శమంత, రాధిక, అర్చన,  ప్రతిభ, సుభాషిని దేవి  గ్రంధాలయ అధికారి డాక్టర్ పూర్ణచంద్రరావు, సూపరిండెంట్ ఉదయభాస్కర్ తదితర అధ్యాపకులు,  విద్యార్థులు  పాల్గొన్నారు.

  • “పత్ర ప్రాముఖ్యత” ప్రదర్శన కార్యక్రమం..

“ప్రకృతిలోని వివిధ వృక్ష జాతులకు చెందిన పత్రాల ప్రదర్శన, వాటి ప్రాముఖ్యత” పై ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్ మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు శాస్త్రవిషయాల పట్ల లోతైన అవగాహన  పెరుగుటకు దోహదం చేస్థాయని అన్నారు. విభాగాధిపతి ఉమా కిరణ్  వివిధ వృక్షాల యొక్క శాస్త్రీయ నామాలను, వాటిలోని ఔషధ గుణాలను విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం ద్వారా పరిశీలించుట కొరకు కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల  వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం,  పీఆర్.ఓ. డాక్టర్  దండుస్వామి, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, అదనపు పరీక్షలు నియంత్రణ అధికారి వినయ్ కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్  నహేద బేగం, డాక్టర్ చంద్రశేఖర్, గంగాధర్, నరేష్ కుమార్, గోపాల్, గ్రంధాలయ అధికారి డాక్టర్ పూర్ణచంద్రరావు,తెలుగు విభాగాధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి,  సూపరిండెంట్ ఉదయభాస్కర్ తదితర అధ్యాపకులు,  విద్యార్థులు  పాల్గొన్నారు.

Guest Lecture on Introduction to the Attention Process

More articles

Latest article