బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ రాజేష్,బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి పరిశీలించారు. వినాయక శోభాయాత్ర మార్గంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.పట్టణంలోని కల్కి చెరువు పరిసరాలను ఎస్పీ పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు విద్యుత్ తీగలు, వీధిదీపాలు తదితర అంశాలను సమీక్షించారు. ప్రజలు శాంతియుతంగా నిమజ్జనం ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. భద్రతాపరంగా ఇబ్బందులు కలుగకుండా శోభాయాత్రలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనేవారు అధికారులతో సహకరించి పండుగను విజయవంతం చేయాలని కోరారు. వారి వెంట డీఎస్పీ విఠల్రెడ్డి, సీఐ అశోక్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.
