అవధాన ప్రక్రియ పరిచయంపై అతిథి ఉపన్యాసం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కొరవి గోపరాజు  తెలుగు విభాగం ఆధ్వర్యంలో  "అవధాన ప్రక్రియ పరిచయం" అనే అంశంపై మంగళవారం అతిథి ఉపన్యాసం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి  మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాలలోని వారు పద్యరచనలతో పాటు  గణితం, రసాయన శాస్త్ర అంశాలను కూడా  తమ ప్రతిభ చేత పద్యాలలో వెల్లడిస్తున్నారని అన్నారు. వయసుతో సంబంధం లేకుండా సాహిత్య కృషి చేసి కేంద్ర స్థాయి  అవార్డులు  అందుకుంటున్నారని, వారి రచనలు వివిధ విద్యా సంస్థల్లో పాఠ్యాంశంగా...