29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వెలగని సెంట్రల్ లైట్లు.. ప్రయాణికులకు ఇక్కట్లు

Must read

📰 Generate e-Paper Clip

కామరెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ వెలగడం లేదు. దీంతో రాత్రి పూట ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. లేదంటే వాహన చోదకులు తిప్పలు తప్పవు జిల్లా కేంద్రంలో ని పాత జాతీయ రహదారిలో వెలగని సెంట్రల్ లైట్లు అధికంగా ఉన్నాయి. రాకపోకలు సాగించే వాన దారులు చీకట్లో ప్రయాణించాల్సి వస్తుంది. రోడ్డుపై ఉన్న గుంతలు అడ్డంగా వచ్చే కుక్కలు కనిపించక పలువురు వాహనదారాలు ప్రమాదాలకు గురైన ఘటనలున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక వర్షం వస్తే మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయినా సంబంధిత శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సెంటర్ లైట్లు వెలిగేల చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Central lights not working... causing problems for passengers

More articles

Latest article