28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రేషన్ డీలర్ల సమస్య పరిష్కరించాలని ఎమ్మార్వోకు వినతిపత్రం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు గత ఐదు నెలల నుండి కమిషన్ రానందున అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా కమిషన్ విడుదల చేయడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. కావున గతంలో ఒకేసారి విడుదల చేసినట్టుగా, ఇప్పుడు కూడా పాత పద్ధతిలోనే కమిషన్ విడుదల చేయాలని వారు కోరారు. ఎలక్షన్ల కన్నా ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో చంద్రం, భరత్ , మల్లేశం, పార్శి నవీన్ ,కర్నాల శ్రీనివాస్, శ్రీనివాస్, నర్సింగరావు తదితరులు  పాల్గొన్నారు.

More articles

Latest article