రేషన్ డీలర్ల సమస్య పరిష్కరించాలని ఎమ్మార్వోకు వినతిపత్రం
బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు గత ఐదు నెలల నుండి కమిషన్ రానందున అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా కమిషన్ విడుదల చేయడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. కావున గతంలో ఒకేసారి విడుదల చేసినట్టుగా, ఇప్పుడు కూడా పాత పద్ధతిలోనే కమిషన్ విడుదల చేయాలని...