26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ఫీల్డ్ అసిస్టెంట్స్ తో ఏపీవో పోశెట్టి సమీక్ష సమావేశం 

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏపీవో పోశెట్టి మాట్లాడుతూ గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు అన్ని పనులను సక్రమంగా చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో ఇప్పటివరకు చేసిన పనులు వాటికి సంబంధించిన సమాచారాలను పొందుపరచాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో సెవెన్ రిజిస్టర్స్ నిర్వహించాలని తెలిపారు.హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత టెక్నికల్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి పంచాయతీ కార్యదర్శులతో ఫీల్డ్ అసిస్టెంట్ తో కలిసి ట్యాంకర్ల ద్వారా మీరు పోయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. . కూలీలు చేసిన పనికి ఎంబి రికార్డులు సకాలంలో చేసి కూలీలకు చేసిన పనికి వేతనాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మోతీరాం సుప్రజా వరగంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ అధ్యక్షులు ఈరమల్ల గౌరవ అధ్యక్షులు తలారి సంజీవ్,రమేష్, భూమయ్య,రాజేందర్,రాము,రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article