29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బిఎస్పీ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ కురుమ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని  కంఠెశ్వర్ బైపాస్ లో గల బిఎస్పీ పార్టీ జిల్లా కార్యాలయంలో బోధన్ నియోజకవర్గానికి చెందిన యువనేత సిరివెసు సంతోష్ బిఎస్పీ పార్టీ సెంట్రల్ కో ఆర్డినేటర్ నిషాని రాంచంద్రం, రాష్ట్ర కార్యదర్శి గైని గంగాధర్, రాష్ట్ర ఈసీ మెంబెర్ నీరడి ఈశ్వర్, జిల్లా అధ్యక్షులు సింగడే పాండు గార్ల ఆధ్వర్యంలో బిఎస్పీ ఖండువ వేసి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్బంగా సంతోష్ కురుమ మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీ తోనే సాధ్యమని విశ్వశిస్తూ పార్టీలో చేరడం జరిగిందని,బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీల రాజ్యం రావడమే ధ్యేయంగా మన్యవార్ కాన్షిరాం, బిఎస్పీ పార్టీ అధ్యక్షురాలు బెహన్ జీ మాయావతి రి ఆలోచన విధానం గ్రామగ్రామాన పార్టీ విస్తరణకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.

More articles

Latest article