24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పెంటకుర్దు, మందర్ణలో రైతులకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : నిజామాబాదు జిల్లా సాలూర మండలం పెంటకుర్దు, మందర్ణ గ్రామాల్లో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు వరి పంట సాగులో నూతన పద్ధతులపై అవగాహన కల్పించారు. డైరెక్ట్ సీడెడ్ రైస్ డ్రం సీడర్, తడి-పొడి పద్ధతుల వల్ల పెట్టుబడి భారం తగ్గడం, నీటి వినియోగం నియంత్రణ, కూలీల ఖర్చు ఆదా వంటి ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నుంచి డి. ఎస్. గణేష్ సాగర్ (బోధన్ ఏరియా మేనేజర్), బాపూజీ ఫణీంద్ర పాల్గొన్నారు.

Awareness among farmers in Pentakurdu and Mandarna

More articles

Latest article