- కాకతీయ మెయిన్ కెనాల్ కు నీటి విడుదల నిలిపివేత
- మెండోర వద్ద వ్యక్తి గల్లంతు
- కొనసాగుతున్న రెస్కూ ఆపరేషన్
మెండోరా, బతుకమ్మ : కాకాతీయ కాలువలో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. కాకాతీయ మెయిన్ కెనాల్ మెండోరా వద్ద వ్యక్తి గల్లంతయిన విషయం తెలిసిన ప్రాజెక్టు అధికారుల నీటి విడుదల నిలిపివేశారు. కాకతీయ మెయిన్ కెనాల్ 6,800క్కూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్న సమయంలో వ్యక్తి గల్లంతు కావడంతో నీటి విడుదలను ఆపేశారు. గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వ్యక్తి ఆచూకి లభించిన తర్వాత నీటి విడుదల తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. గల్లంతైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. గణేష్ నిమజ్జన సందర్భంగా మెండోరా వద్ద ఎల్ఎండీ కాలువలో దిగి గల్లంతయ్యాడని తెలిసింది
