బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కల్యాణ మండపంలో పోలీసుల ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకొని శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకట నారాయణ పాల్గొని, వినాయక మండప నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. వినాయక చవితి పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకునేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. సమావేశానికి పట్టణ వాసులు, వివిధ సంఘాల పెద్దలు హాజరై పండుగను సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలో బోధన్ సార్వజనిక్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్‌ను అశోక్ సేల్స్ తమ్ము షెట్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై భాస్కరాచారి, విద్యుత్ ఏఈ కృష్ణ, మున్సిపల్ మేనేజర్ రమేష్, బోధన్ సార్వజనిక్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్‌తో పాటు రాకసిపేట్, శక్కర్ నగర్ పెద్దలు ప్రదీప్ గుప్తా, ప్రవీణ్ మహరాజ్, నక్క లింగారెడ్డి, గుమ్ముల అశోక్ రెడ్డి, బెంజర్ గంగారాం, రుద్ర సత్యనారాయణ, హరికాంత్ చారి, బీర్కూర్ బుజ్జి, తోకల సాయిరెడ్డి, గుండెడి శంకర్, సంగ్రామ్, సాయిబాబు గౌడ్, యూనుస్ పటేల్, కలీమ్, మక్కన్న తదితరులు పాల్గొన్నారు.
