బోధన్‌లో వినాయక చవితి శాంతి కమిటీ సమావేశం
బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కల్యాణ మండపంలో పోలీసుల ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకొని శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకట నారాయణ పాల్గొని, వినాయక మండప నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. వినాయక చవితి పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకునేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. సమావేశానికి పట్టణ వాసులు, వివిధ సంఘాల పెద్దలు హాజరై పండుగను సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలో...