23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా జైల్ సూపరిండెంట్ దశరథం

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ప్రతి ఒక్కరు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా జైల్ సూపరిండెంట్ దశరథం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సారంగపూర్ జైల్ లో టి. బి ముఖ్ తు అభియాన్ కార్యక్రమం లో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టి. బి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా టి. బి వ్యాధి గురించి వివరంగా అందరు తెలుసుకోవాలన్నారు. టి. బి లక్షణాలు, అది సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకోవాలన్నారు. ఈక్యాంప్ లో అందరి ఎక్స్ రే లను తీశారు. ఈ కార్యక్రమం లో జిల్లా టిబి అధికారిణి డాక్టర్ అవంతి, జైల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దినేష్,జిల్లా టిబి,హెచ్.ఐ.వి. కో ఆర్డినేటర్ రవిగౌడ్, డీపీసీ లక్ష్మణ్,జె ఎల్ డి ఐ సూపర్ వైజర్ స్రవంతి,  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Be vigilant about infections

More articles

Latest article