27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బొర్లం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

  • ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

 

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని బొర్లం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు టీ.వీ.ఎస్. ఎక్సెల్ ఢీకొట్టిన సంఘటనలో గాంధారి మండలం సోమ్ల నాయక్ తండా కు చెందిన రమావత్ గోవింద్ స్పాట్ లోనే మృతి చెందగా రమావత్ రాములు నిజామబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారని భయపడి దారి మళ్లించడంతో ఎదురుగా బాన్సువాడ నుండి కామారెడ్డి వెళ్లే బస్సును ఢీ కొనడంతో సంఘటన జరిగిందని, ఈ సంఘటనకు పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహ ఆవేశాలతో మృత దేహాన్ని పోలీస్ స్టేషన్ ముందు ఉంచి ధర్నా నిర్వహించారు. వీరితో పాటు ఇంకో బైక్ పైవస్తున్న ఇద్దరు వ్యక్తులు మొహమ్మద్ నగర్ మండలం, కోమలంచ గ్రామానికి చెందిన హనుమండ్లు,గంగాధర్ లను బస్సు ఢీ కొనడం తో తీవ్ర గాయాలై బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

More articles

Latest article