30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ : నవ భారత నిర్మాత, మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి పురుష్కరించుకుని ఆయన చిత్రపటానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా మార్చిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ  అని కొనియాడారు. యువత రాజకీయాల్లో ప్రోత్సహించాలని ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం ఆయన చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. నేడు భారత్‌ ఏఐ, టెక్నాలజీ రంగాల్లో ముందుకు దూసుకుపోతుందంటే దానికి బలమైన పునాది వేసింది రాజీవ్ గాంధీ విజన్ అని అన్నారు. దేశం కోసం, ప్రజల కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని.. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను పునికి పుచ్చుకున్న రాహుల్ గాంధీ ని  ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ముందున్న కర్తవ్యం అని చెప్పారు. ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు, యువత సంసిద్ధులు కావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు యువకులు  పాల్గొన్నారు.

More articles

Latest article