మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
బతుకమ్మ, జుక్కల్ : నవ భారత నిర్మాత, మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి పురుష్కరించుకుని ఆయన చిత్రపటానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా మార్చిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. యువత రాజకీయాల్లో ప్రోత్సహించాలని ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం ఆయన...