నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగర చివర్లో ఉన్న దొడ్డి కొమురయ్య నగర్ కాలనీలొ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ గతంలో దొడ్డి కొమరయ్య నగర్ కాలనీ నిలబెట్టుకోవడం కోసం అనేక పోరాటాలు ఆందోళనలు చేసి దాదాపు 500 కుటుంబాలు నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేసింది ఎర్రజెండా అని తెలిపారు. వందల ఎకరాలు ఆక్రమించుకున్న భూస్వాముల జోలికి ఎవ్వరు వెళ్లట్లేదు కానీ నిలువ నీడ లేక ఉండటానికి ఇల్లు కావాలని ఆశతో 60 గజాలు భూమిని ఆక్రమించుకున్న నిరుపేదల్ని ఖాళీ చేయించడం బెదిరింపులకు గురి చేయడం కరెక్ట్ కాదన్నారు. దాదాపు మూడుసార్లు ఏరియా నుండి కౌన్సిలర్ గా గెలిచిన వాళ్ళు ఉన్నారు.. నగరం మేరుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు నిరుపేదల రోడ్డున పెడితే మాత్రం పలకరించే దిక్కులేని ఈరోజు దొడ్డి కొమురయ్య నగర్ వాసులు ఉన్నారనితెలిపారు. వారికీ అండగా సిపిఎం పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టి వారికి అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు రాములు, నగర కమిటీ సభ్యులు అనిత, శాఖ కమిటీ సభ్యులు యశోద, రజియా, సంగీత, లక్ష్మీబాయి, రమాబాయి, గోదావరి భాయ్, జై శ్రీ, మంగళ బాయి, దీక్షిత తదితరులు పాల్గొన్నారు.

