26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల :

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించుకొని, సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం నిజాం ప్రభుత్వంతో పోరాడిన తీరును పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి విద్యార్థులకు వివరించారు. నిజాం ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో కష్టాలకు ఇబ్బందులకు గురయ్యారని, హైదరాబాద్ రాష్ట్రం నిజం పాలన నుండి విముక్తి పొందిన తర్వాత ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారని .దీనికి ప్రధానంగా ఎందరో వీరులు ఇది సాధించడానికి కృషి చేశారని వారందరినీ తలచుకోవడం మనందరి బాధ్యతని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునీరుద్దీన్, ప్రసాద్, పవన్, సమిత, శ్రీనివాస్,రాజేందర్, రాజనర్సయ్య,ఇందిరా, గంగాధర్,ప్రవీణ్ శర్మ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article