ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
బతుకమ్మ, ఏర్గట్ల : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించుకొని, సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం నిజాం ప్రభుత్వంతో పోరాడిన తీరును పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి విద్యార్థులకు వివరించారు. నిజాం ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో కష్టాలకు ఇబ్బందులకు గురయ్యారని, హైదరాబాద్ రాష్ట్రం నిజం పాలన నుండి విముక్తి పొందిన తర్వాత ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారని .దీనికి ప్రధానంగా ఎందరో వీరులు ఇది...