27.3 C
Hyderabad
Friday, July 31, 2026

చిన్నారిపై దాడి చేసిన కుక్కలు: తీవ్ర గాయాలు

Must read

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. భవానీపేట గ్రామానికి చెందిన దాసరి అంజవ్వ కూతురు అక్షిత(3) అనే చిన్నారి ఉదయం వేళ ఇంటిఎదుట ఆడుకుంటుండగా ఓ కుక్క  ఒక్కసారిగా చిన్నారిపై దాడిచేయడంతో మొహం చెంప పై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్షితను ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని న్యూ అబాదిలో సైతం ఇద్దరిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. నిత్యం ఏదో ఒకచోట కుక్కల బారిన పడి అనేకమంది గాయలపాలవుతున్న సంబంధిత అధికారులు తమకు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కుక్కల బెడద నుంచి కాపాడాలని అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article