చిన్నారిపై దాడి చేసిన కుక్కలు: తీవ్ర గాయాలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. భవానీపేట గ్రామానికి చెందిన దాసరి అంజవ్వ కూతురు అక్షిత(3) అనే చిన్నారి ఉదయం వేళ ఇంటిఎదుట ఆడుకుంటుండగా ఓ కుక్క ఒక్కసారిగా చిన్నారిపై దాడిచేయడంతో మొహం చెంప పై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్షితను ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని న్యూ...