బతుకమ్మ, బిచ్కుంద : గత కొన్ని రోజులుగా ఎడతెరిపి కురుస్తున్న వర్షాలదృశ్య నిజాంసాగర్ ప్రాజెక్టు ఎక్కువ పరివాహక ప్రాంతం నుండి భారీ వరద నీరు వస్తున్న సోమవారం ఏ సమయంలోనైనా ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి నీటిని వదిలే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి నదిలోకి చేపల వేటకు గాని పశువుల మేతకు గాని వెళ్లకుండా ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంజీరా నది తీర పరివాహక ప్రాంతా గ్రామాల్లో దండోరా వేయించాలని పోలీసులక సూచించారు.
