24.1 C
Hyderabad
Monday, August 3, 2026

కథువా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ : ఏడుగురు మృతి

Must read

📰 Generate e-Paper Clip

జమ్మూ కశ్మీర్ ను వెంటాడుతున్న విషాదాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ : జమ్మూ కశ్మీర్ లోని మరో ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. కథువా జిల్లాలోని ఘాటీ  గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో క్లౌడ్ బ్లరస్ట్ సంభవించిందని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.  ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.  ఆ శిథిలాల కింద కుటుంబం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా సహాక్ ఖాద్, ఊజ్ నదులలో నీటిశాతం పెరిగాయి. కథువా పోలీస్ స్టేషన్లోకి వరద నీరు చేరింది. ఆ ప్రాంతంలో జాతీయ రహదారితో సహా రైలు మార్గాల రాకపోకలు నిలిచిపోయాయి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ క్లౌడ్ బరస్ట్ పై సమాచారం అందగానే కథువా పోలీసు అధికారి శోబిత్ సక్సేనాతో మాట్లాడారు. ఈఘటన వివరాలను  ’ఎక్స్‘ వేదికగా వెల్లడించారు. అదే రాష్ట్రంలో ఇటీవల కిశ్త్ వాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించి 60 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

More articles

Latest article