28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బిచ్కుందలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో79వ స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం మండల కోర్ట్ ఆవరణలో, స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు పార్టీ కార్యాలయాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయల్లో జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం పలువురికి స్వీట్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ కిషోర్ 79 స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా కొనియాడారు. అంతేకాకుండా స్వతంత్య్ర సమరయోధులు దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేశారు.

వీరుల త్యాగాల వల్లే ఈనాడు దేశం శాంతియుతంగా, స్వేచ్ఛ యుతంగా ఉందని తెలిపారు. ప్రపంచంలో భారతీయులందరూ ఎక్కడున్నా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పండుగలాగా ఘనంగా జరుపుకుంటున్నారు. అని అన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులకు ఐదువేల రూపాయలు విలువచేసే ప్లేట్లను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు విద్యా సంస్థల చైర్మన్లు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది పాఠశాలలో విద్యార్థులతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Independence Day celebrations in Bichkunda

More articles

Latest article