29 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయ జెండా ఆవిష్కరించిన కుంట రమేశ్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజాామాబాద్, బతుకమ్మ : 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి జిల్లా కేంద్రంలోని  ప్రధాన కార్యాలయం లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు, చంద్రశేఖర్ రెడ్డి ,  లింగయ్య, ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగభూషణం వందే , అధికారులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా ’భారత దేశం లో సహకార ఉద్యమం‘ అను అంశము పై స్థానిక ఎస్ఎస్ ఆర్  కళాశాల లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.  గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు బ్యాంకు అధ్యక్షులు, డైరెక్టర్లు,  సీఈవో అందజేశారు. అధ్యక్షులు కుంట రమేశ్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు సిబ్బంది, రైతులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల అధ్యక్షుల పదవి కాలం  6 నెలల పొడిగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి,  సహకార శాఖ మంత్రికి,  జిల్లా నాయకులకు ప్రాథమిక వ్యవసాయ సహకార అధ్యక్షులు తరపున బ్యాంకు పాలకవర్గం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Kunta Ramesh Reddy unfurled the national flag.

More articles

Latest article