29 C
Hyderabad
Monday, August 3, 2026

 ఓట్ చోర్ .. గద్దె చోడ్

Must read

📰 Generate e-Paper Clip

. . .యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏఐసీసీ పిలుపుమేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ధర్నాచౌక్ వద్ద కాగడాలు చేతబట్టి రాహుల్ గాంధీకి మద్దతుగా బిజెపి ప్రభుత్వం చేసిన ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, పిసిసి క్రమశిక్షణ కమిటీ మెంబర్ జీవీ రామకృష్ణ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఎన్నికల సంఘంతో కలిసి చేసిన కుట్ర రాహుల్ గాంధీ బయటపెట్టడంతో బిజెపి నీచబుద్ధి దేశ ప్రజలకు అర్థమైందని, బిజెపి ప్రజాస్వామ్యం విలువలను కాలరాసి ప్రజాస్వామ్యం కూని చేసిందని వారు పేర్కొన్నారు. బిజెపి చేసిన ఓట్ల దొంగతనం భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేసిందని, రాహుల్ గాంధీ బయటపెట్టిన అతిపెద్ద ఓటు కుంభకోణం బిజెపి పార్టీ అధికారం కోసం ఎంతకైనా తెగుస్తుంది అనడానికి ప్రత్యేక ఉదాహరణగా వారు పేర్కొన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే 2024 లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉండేదని,ఏది ఏమైనా 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడాన్ని ఎవరు ఆపలేరని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబూద్ హందాన్, జెండా బాలాజీ ఆలయ కమిటీ చైర్మన్ ప్రమోద్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రేవతి పోల ఉష , అపర్ణ, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అద్నాన్,   జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిత్య పాటిల్ , ఇర్ఫాన్,  నయీమ్,  యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షులు మోయిన్,  ఆకుల మహేందర్,  మనోహర్,  నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article