29 C
Hyderabad
Monday, August 3, 2026

అన్ని చట్టాలకు వర్తించేది ఎవిడెన్స్ చట్టమొక్కటే                     

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అన్ని చట్టాలకు వర్తించేది ఎవిడెన్స్ చట్టమొక్కటేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ అన్నారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవ సదన్ లో మూడు రోజులపాటు నిర్వహించిన ‘న్యాయవాదుల వృత్తి వృద్ధి కోసం చట్టాలు’కార్యక్రమం చివరిరోజైన గురువారం ముగిసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ మాట్లాడుతూ ఎన్ని చట్టాలు ఉన్న అన్నిటికి సాక్ష్యధారాల చట్టమే ప్రామాణికమని తెలియజేశారు. వ్యవసాయం పనులు చేసేటపుడు ఒక పంటనే సాగుకు ఎంచుకున్నట్లు న్యాయవాద వృత్తిలో ఎదగడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఒక చట్టంలో ప్రవీణ్యత పెంపొందించుకోవాలని ఆమె ఉద్బొదించారు. చివరి రోజున సీనియర్ న్యాయవాది మంథని రాజేందర్ రెడ్డి మాదకద్రవ్యాల మందులు మాదకద్రవ్యాల పదార్థాల చట్టం ఎన్ డి పి ఎస్ పై కీలకోపన్యాసం చేశారు. ఎన్ డి పి ఎస్ చట్టం మాదకద్రవ్యాలను ఉత్పత్తి, అమ్మకం, రవాణా, నిల్వ చేయడాన్ని నియంత్రిస్తుంది, నిశేదిస్తుంది.వ్యక్తులుగా, వ్యక్తిగా మాదకద్రవ్యాలను అక్రమంగా కలిగి ఉండటం, అమ్మటం, వాణిజ్యానికి అనుకూలంగా మలచుకోవడం నేరాలుగా పరిగణిస్తుందని ఆయన తెలిపారు.కోకైన్, నల్లమందు, గాంజాయి అక్రమ వినియోగం చేయించడం సమాజహితం దృష్ట మంచిదికాదని చట్టం చెబుతోందని అన్నారు.ఈ చట్టం ప్రకారం ఎవరినైనా అదుపులోకి తీసుకున్న, అరెస్ట్ చేసిన మామూలుగా బెయిలు లభిందని పేర్కొన్నారు.గాంజ లేదా డ్రగ్స్ పరిణామం ఎంత అనే దానిపై వ్యక్తికి, వ్యక్తులకు బెయిలు ఇవ్వాలా లేదా అనేది కోర్టుకున్న అధికారిక పరిధి అని ఆయన తెలిపారు. చిన్నసైజు పరిణామంలో అంటే కిలో లోపు గంజాయి నేరారోపణనలు ఎదుర్కొంటున్న వారికి బెయిలుకు అర్హులని అన్నారు. మాదకద్రవ్యాలను నిందితుల నుండి స్వాదీనం చేసుకుంటున్నప్పుడు స్థానిక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ ల సమక్షంలో స్వాదిన పంచానామ చేయాల్సిన ఉంటుందని వివరించారు.ఒకవేళ వాహనాలను సీజ్ చేస్తే దానికంటూ ఒక రూల్స్ ఉన్నాయని తెలిపారు.చట్టాలు ఉన్న దానికి ఉపకరించే విదంగా న్యాయశాస్త్రాన్ని చదవాలని సూచించారు. డ్రగ్స్ కలిగి ఉండి దానికి అలవాటు పడినవారిని పునరావాస కేంద్రానికి పంపించాలని తెలిపారు. చట్టాలను అధ్యయనం చేయాలని, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను కూడా అధ్యయనం చేస్తే న్యాయవాద వృత్తిలో ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని రాజేందర్ రెడ్డి అన్నారు.అనంతరం సీనియర్ న్యాయవాది బి. అశోక్ ప్రసంగిస్తు ఐపీసి స్థానంలో నూతనంగా మూడు క్రిమినల్ మేజర్ చట్టాలు అమలులోకి వచ్చాయని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష అధినియం అనే చట్టాల ప్రకారమే క్రిమినల్ కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు, వాటికి అనుగుణంగా న్యాయవాదులు కేసులను స్టడీ చేయాలని ఆయన కోరారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు మూడు రోజులపాటు చట్టాలపైన అవగాహనా కార్యక్రమం నిర్వహించినట్లు న్యాయసేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు. న్యాయవాదుల వృత్తికి ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుభేదార్ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు మామిళ్ళ సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.

The only law that applies to all laws is the law of evidence

More articles

Latest article