అన్ని చట్టాలకు వర్తించేది ఎవిడెన్స్ చట్టమొక్కటే                     

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అన్ని చట్టాలకు వర్తించేది ఎవిడెన్స్ చట్టమొక్కటేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ అన్నారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవ సదన్ లో మూడు రోజులపాటు నిర్వహించిన 'న్యాయవాదుల వృత్తి వృద్ధి కోసం చట్టాలు'కార్యక్రమం చివరిరోజైన గురువారం ముగిసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్...