ఇందల్వాయి, బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్నాపల్లి గ్రామ ప్రజలకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు,తహసిల్దార్ వెంకట్రావులు గురువారం ఉదయం సిర్నపల్లి గ్రామాన్ని సందర్శించారు. అనంతరం సిర్నపల్లి వాగును సందర్శించారు. ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు సిబ్బంది మాక్ డ్రీల్ కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించారు.రాష్ట్రంలో ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అత్యంత భారీ వర్షాల వలన ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.గ్రామ ప్రజలు ఎవరూ కూడా వాగులు, కాలువలు, చెరువులు, జలపాతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించలన్నారు. అదేవిధంగా ఎవరివైనా పాత ఇండ్లు కూలిపోయే దశలో ఉంటే అప్రమత్తంగా ఉండి గ్రామ పంచాయతీకి కార్యదర్శులకు సమాచారం ఇచ్చి పునరావాస కేంద్రంలో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.విద్యుత్ స్తంభాలను ముట్టుకోరాదన్నారు, విద్యుత్ తీగలు ఎక్కడయిన తెగి వుంటే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ తగిన చర్యలు తీసుకునేలా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలన్నారు, అన్ని గ్రామాలలో అనువైన స్థలాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు,ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనంతరావు,తహసిల్దార్ వెంకట్రావు,పోలీసు సిబ్బంది,ఫైర్ ఇంజన్ సిబ్బంది,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
