27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై సాయన్న

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : కుడుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రుద్రూర్ ఎస్సై సాయన్న సూచించారు. గురువారం రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో తహసీల్దార్ తారబాయి, ఎంపిడిఓ భీమ్ రావు, ఎస్సై సాయన్న,  ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి సందర్శించారు. శిధిలావస్థకు చేరిన ఇళ్లను పరిశీలించారు. కురుస్తున్న భారీ వర్షం కారణంగా శిధిలావస్థకు చేరిన ఇళ్ళు దెబ్బతిన్నాయన్నారు. మూడు కుటుంబాలు ధావోజీ గంగారాం, శంకి వీరయ్య, సంగోజి సావిత్రిలను గ్రామంలోని కమ్యూనిటీ హాల్ షెల్టర్లో నివాసం ఉంచామన్నారు.  ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదన్నారు.

People should be vigilant: SS Sayanna

More articles

Latest article