- అక్బర్ నగర్ లో రాత్రి పగలు మొరం తవ్వకాలు
- అడ్డుకున్న గ్రామస్థుల పోలీస్ స్టేషన్ తరలింపు
- రెవెన్యూ ల్యాండ్ గా నిర్ధారించిన తహసీల్దార్
- అక్రమంగా తవ్వకాలపై చర్యలకు అధికారుల వెనుకడుగు
నిజామాబాద్, బతుకమ్మ: ఆ గ్రామంలో జరుగుతున్న మొరం తవ్వకాలకు రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అది రెవెన్యూ శాఖకు చెందిన భూమి అది. కాని అక్కడ మొరం తవ్వకాలను అడ్డుకునే పని మాది కాదు. మొరం తవ్వకాలు జరుపుతన్న వారిపై చర్యలకు (బైండోవర్), వాహనాల సీజ్ మాత్రం చేయం అంటుంది రెవిన్యూ శాఖ. మొరం తవ్వకాలు జరుపడం చట్ట విరుద్ధం కాదు. అనుమతులు, తవ్వకాల వ్యవహారం అంతా మైనింగ్, రెవిన్యూ శాఖాలది. కాని ఆభివ్రుద్ధి పనుల కోసం జరిగే మొరం తవ్వకాలు, రవాణాను అడ్డుకుంటే మాత్రం చర్యలు తీసుకుంటాం అంటున్నారు స్థానిక పోలీసులు. ఇది ఎలా ఉందంటే అప్పట్లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కామెడి సీన్ ను తలపిస్తోంది. అందులో హిరో, కమెడియన్ లు పెళ్లి చూపులకు వెలుతుంటారు. అప్పుడు కమెడియన్ బురదలో పడి తన బట్టలు తడిసిపోగా హీరో బట్టలను వేసుకుంటాడు. పెళ్లి చూపులలో అక్కడ పెళ్లి వారికి అందరికి కమెడియన్ పెళ్లికొడుకు అని అతను వేసుకున్న బట్టలు గురించి తనను అడగవద్ధనే సీన్ కడుపుబ్బ నవ్వించింది. ఇప్పుడు రుద్రూర్ మండలంలో జరుగుతున్న మొరం తవ్వకాలు ప్రభుత్వ అధికారుల తీరు అలానే ఉంది.

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామ శివారులో 246 సర్వే నంబర్ లో దాదాపు 60 ఎకరాలలో రెవిన్యూ భూమిగా రికార్డులలో ఉంది. అక్కడ కొందరు గ్రామస్థులు కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న వారికి మాత్రం పట్టా పాసు పుస్తాకాలు ఇవ్వలేదు. ఇటీవల కొందరు గ్రామస్ధులు మాత్రం అక్కడ తమకు రెవిన్యూ శాఖ సబ్ డివిజన్ చేసిన సర్వే నంబర్ లలో దాదాపు 8 ఎకరాల మేర రెవిన్యూ భూమిలో తమకు అనుమతులు ఉన్నాయని మొరం తవ్వకాలు చేపట్టారు. స్థానిక పనులకు వినియోగిస్తుండగా మరికొంత డంప్ చేస్తున్నారు. ఇతర అవసరాలకు విక్రయాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహరం రాత్రి పగలు తేడా లేకుండా సాగుతోంది. దానితో అక్బర్ నగర్ లో గుట్టలు మాయమౌతున్నాయి. బుదవారం అక్బర్ నగర్ కు చెందిన రెవిన్యూ భూమిలో పంటలు సాగు చేసిన రైతులు మొరం తవ్వకాలను అడ్డుకున్నారు. దానితో ఉన్నపళంగా పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. డెవలప్ మెంట్ పనులకు అడ్డుకోవద్ధని వారినే స్టేషన్ కు తరలించడం విశేషం. చదును చేసిన భూమిని కబ్జాకు ప్రయత్నాలు జరగుతన్నాయి. పేరుకు ఓ మండలంలో తవ్వకాలు చేస్తున్నది పక్క మండలం వారు. ఉమ్మడి మండలంగా ఉన్నప్పుడు పొలిటికల్ గా లీడర్ల అండతో అక్కడ నిత్యం తవ్వకాలు, రవాణా జరుగుతోందని ఈ వ్యవహరం నియోజకవర్గంలో అందరికి తెలిసిన ఎవ్వరు కిక్కురు మనరు అంటున్నారు స్థానికులు.

రుద్రూర్ మండలంలో జరుగుతున్న అభివ్రుద్ధి పనుల తాలుకు సమాచారం ఇవ్వమంటే రెవిన్యూ శాఖాధికారులు తమకు తెలియదు అంటున్నారు. శాంతి భధ్రతల సమస్య కాని మొరం తవ్వకాలు, రవాణా అంశంలో పోలీస్ శాఖ తల దూర్చుతోంది. ఇక్కడ స్థానిక అధికారులు పనిచేస్తున్న అంతా పెద్దవాళ్ల చెప్పు చేతుల్లోనే పనిచేయాలి. అక్కడ పేరుకే ఉద్యోగం కాని పెత్తనమంతా లీడర్లదే. దానితో బుదవారం అక్బర్ నగర్ లో జరుగుతున్న మొరం తవ్వకాలపై స్థానిక తహసీల్ధార్ తారాబాయిని వివరణ కోరగా 246 సర్వే నంబర్ లో జరుగుతున్న మొరం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అది రెవిన్యూ శాఖకు చెందిన భూమి అని తేల్చారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాన్సువాడ నియోజకవర్గం మండలాల పై పెత్తనం పొలిటికల్ లీడర్ల నీడనే కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వి రవాణా చేసిన, మొరం కోసం గుట్టలు మాయం చేసిన పెద్ధ హస్తం కలిగిన నేతల జోక్యం ఉంటుదని అందుకే అధికారులు చూసి చూడనట్లు ఉంటారని యా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. స్థానికంగా ఇసుక, మొరం అక్రమ రవాణా జరిగిన వాహనాల సీజింగ్, బైండోవర్, జరిమాణాలు అంత ఓ పథకం ప్రకారం జరుగుతుందని అనే విమర్శలు ఉన్నాయి.
