29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సరెండర్ కావాల్సిందే..

Must read

📰 Generate e-Paper Clip

  • రెజ్లర్  సుశీల్ కుమార్ కు సుప్రీం కోర్టు ఆదేశం

 

ఢిల్లీ, బతుకమ్మ : ఒలంపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లో సరెండర్ కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. గత మార్చి 4న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ రద్దు చేసింది. జూనియర్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధన్కర్ హత్య కేసులో సుశీల్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తన కుమారుడి హత్య కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్ కు ఇన్ని రోజులు బెయిల్ ఇవ్వడంపై సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కుమార్ తరపున ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలాని, ధన్కర్ తరపున సిధార్థ మ్రుదుల్ వాదనలు వినిపించారు.

More articles

Latest article