27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పేకాట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు కేంద్ర పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి భిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీరప్ప టెంపుల్ దగ్గర పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 14 వేల100 రూపాయలు నగదు మూడు బైకులు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మండలంలో పేకాట నిర్వహించే స్థావరాల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు. పేకాట స్థావరాల వివరాలు తెలిసినవారు 8712686154 సెల్ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు

More articles

Latest article