30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏర్గట్ల విద్యార్థులకు జాతీయస్థాయి కథల పోటీలలో బహుమతులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: మాచి రాజు బాల సాహిత్య పీఠం హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీలలో ఏర్గట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు, ప్రశంస పత్రాలు అందుకున్నారు. మార్చి నెలలో నిర్వహించిన ఈ జాతీయస్థాయి కథల పోటీలలో ఏర్గట్ల  పాఠశాల విద్యార్థులు అభిలాష్,రాజేష్, రిశ్వంత్,శ్రీనిధి రాసిన కథలకు బహుమతులు లభించినాయని,పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ తెలిపాడు. బహుమతుల పొందిన మరియు ఫైనల్ కు చేరుకున్న విద్యార్థులను పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మునిరుద్దీన్ ప్రశంస పత్రాలు బహుమతు లను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రసాద్, శ్రీనివాస్,విజయ్ గంగాధర్,గంగా మోహన్, రాజనర్సయ్య,రాజేందర్, ట్వింకిల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article