ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ డివిజన్ మాల మహానాడు ఆధ్వర్యంలో మాల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మాల మహానాడు డివిజన్ అధ్యక్షులు మాదరి రాజన్న, ట్రెజరర్ పులి గంగాధర్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి శెట్టిపల్లి నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు పింజా పెద్ద భోజన్న,ఎం కోటేశ్వరరావు,చిట్టిమాల నగేష్ లు పాల్గొని 1997 ఆగస్టు 11న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పానంగి శేషయ్య, గోపతోటి నారాయణ,ల వీరోచిత పోరాట స్ఫూర్తిని కొనియాడి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డివిజన్ ప్రెసిడెంట్ మాధరి రాజన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం ప్రకారం మాల మాల అనుబంధ కులలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని, ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం ఒక కులానికి మాత్రమే న్యాయం జరిగి మిగతా ఎస్సి కులాలకు పూర్తిగా అన్యాయనికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మాల అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, మాలలతో పెట్టుకున్న గత ప్రభుత్వాలు ఏ విధంగా అధికారానికి దూరం అయ్యాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పై పునః సమీక్షించకుంటే రాబోయే రోజుల్లో మాలలను కూడగట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు రొడ్డ సాయన్న తలారి సుదర్శన్ నర్సయ్య జీవన్ అంగరి ప్రదీప్ లు పాల్గొన్నారు.

