26.2 C
Hyderabad
Monday, August 3, 2026

చంద్రబాబుకు గురుదక్షిణ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం

Must read

📰 Generate e-Paper Clip

  • బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో
  • కాళేశ్వరం పై జస్టిస్ ఘోష్ రిపోర్ట్ పొలిటికల్ రిపోర్ట్ గా మారింది
  • బాల్కొండ ఎమ్మెల్యే, మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ :  ఆంధ్రా సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి మేడిగడ్డను నిలిపేసి గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా బణకచెర్లకు నీళ్లను వదిలి గురుదక్షిణ చెల్లించుకోవాలని చూస్తున్నారన్నారు. చీమంత కాలేశ్వరం సమస్యకు కొండంతగా చూపిస్తూ కేసీఆర్ను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టు కూలిందంటూ అసత్య ప్రచారం చేసి, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు అదే ప్రయత్నం చేస్తున్నారు. జస్టిస్ గోష్ రిపోర్టు రేవంత్ రెడ్డి చంద్రబాబు బీజేపీల కలయికతో రూపొందించిందని ఎమ్మెల్యే విమర్శించారు. రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో అధికారులకు సమర్పిస్తే, అంతకుముందే కాంగ్రెస్ నాయకులు కాలేశ్వరం పై ఇష్టా రాజ్యాంగ మాట్లాడుతున్నారని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు కూడా వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు. ఇది పొలిటికల్ కమిషన్ రిపోర్ట్ గా మారిందని చెప్పారు. 2007 నుంచి 2014 వరకు మహారాష్ట్ర తెలంగాణ సెంటర్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న తమ్మిడిహట్టి వద్ద ఎందుకు ప్రాజెక్ట్ కట్టలేదని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీకి, మూసి ప్రాజెక్ట్ కి ఎటువంటి అనుమతులు లేకున్నా ఎన్డీఎస్ఏ క్లియరెన్స్ వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. సమావేశంలో జిల్లా నాయకులు దాదన్న గారి విట్టల్, బాజిరెడ్డి జగన్, ప్రభాకర్, సుజిత్ సింగ్ ఠాకూర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article