కామారెడ్డి సిటీ, బతుకమ్మ: అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు అనుబంధాలకు గుర్తుగా నిర్వహించుకునే పండగ రక్షాబంధన్. ఏటా శ్రావణ పౌర్ణమి రోజు రాఖి పండగ నిర్వహించుకుంటారు. గత పదిహేను రోజుల నుంచే మార్కెట్లో రాఖీల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్ ప్రాంతాల్లోనే దుకాణాలు కనిపించేవి. ఇప్పుడు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో, విధుల్లో సైతం దుకాణాలు వెలిశాయి. అన్నా దమ్ముళ్లకు ఏ రాఖీ కడితే బాగుంటుందో అని అక్కా చెల్లెలు వెతికి వెతికి ఎంపిక చేసుకుంటున్నారు. మరో వైపు మిఠాయి దుకాణాలు కళకళలాడాయి.

