24 C
Hyderabad
Sunday, August 2, 2026

భూమాత డెవలపర్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ హౌజింగ్ బోర్డుకాలనీలో భూమాత డెవలపర్స్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. శుక్రవారం భూమాత డెవలపర్స్ కార్యాలయంలో ఎమ్మెల్యే ధన్ పాల్ ప్రత్యేక పూజలు నిర్వహించి డెవలపర్ యజమాని లక్కం భూమయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో రియల్ రంగంలో దిన దినంగా అభివ`ద్ది చెందుతుందన్నారు. ఇటీవల కాలంలో భూములపై పెట్టుబడులకు ప్రజలకు ఆసక్తి చూపుతున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సరైన దస్తావేజులు కలిగిన భూములను మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన భూమాత డెవలపర్స్ నిర్వాహకులు లక్కం భూమయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రణిత్ కౌశిక్, బీజేపీ నాయకులు మల్లేష్ యాదవ్, తాళ్ల శివకుమార్, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

MLA Dhanpal launches Bhumata Developers

More articles

Latest article