24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: జహీరాబాద్ పార్లమెంట్ ఎం.పీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదిన వేడుకలను శుక్రవారం జహీరాబాద్ పార్లమెంటరీ దిశా కమిటీ సభ్యులు నడిపింటీ నగేష్ ఆధ్వర్యంలో మోస్రా మండలం, చింతకుంట గ్రామంలోని వృద్దశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. ఎం.పీ సురేష్ కుమార్ శెట్కార్ జన్మదినాన్ని పురస్కరించుకొని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు  పండ్లు, బ్రెడ్ ప్యాకేట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మోస్రా అద్యక్షులు కొత్మిర్ కార్ లక్ష్మణ్, బాన్సువాడ కిసాన్ కేత్ అధ్యక్షులు శనిగరం కిషన్ , మాజీ పీఏసిఎస్ చైర్మన్ పత్తి రాము, వర్ని మాజీ ఏఎంసీ చైర్మన్ బందెల సంజీవులు, డిసీసీ డెలిగేట్ ప్రవీణ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ అక్కపల్లి నాగేందర్, అక్బర్ నగర్ మాజీ సర్పంచ్ రామాగౌడ్, గ్రామ అధ్యక్షులు రాంబాబు, రైతు సమన్వయ కమిటీ మాజీ.అధ్యక్షులు తోట సంగయ్య, మండల నాయకులు రజాక్, దూడ నరేష్ ,మచ్చేందర్, ఎం లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article