26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ పనులను వేగవంతం చెయ్యండి

Must read

📰 Generate e-Paper Clip

  • డీపీఓ శ్రీనివాస్ రావు

 

భీంగల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పనులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వేగవంతం చేసి పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి, డీ పీ ఓ శ్రీనివాస్ రావు మండల అధికారులను ఆదేశించారు. గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇల్లు,వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖల పనులు, సీజనల్ వ్యాధులు,  వనమహోత్సవము తదితర అంశాలపై అధికారులతో సమీక్షి నిర్వహించారు.పనులు పూర్తి అయ్యేవరకు సంబంధిత అధికారులు రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, ఎం పి ఓ జావిద్, మెడికల్ ఆఫీసర్ అజయ్, ఏపీ ఓ నరసయ్య, ఆర్టికల్చర్ అధికారి ఏ ఈ,హౌసింగ్ ఏ ఈ ఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article