నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రో. జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రామ్ మోహన్ రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పుష్పమాలతో సత్కరించి, “తెలంగాణ తొలి స్వాప్నికుడు జయశంకర్”అని, వారి కల, సిద్ధాంతంతోనే “తెలంగాణ రాష్ట్రం సాకారమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. రంగరత్నం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. నహేద బేగం, పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్, పి.ఆర్.ఓ. డా.దండు స్వామి, ఏ.ఓ.రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయ భాస్కర్, అధ్యాపకులు రాహుల్, సుభాషిణిదేవి, డా.శ్రీనివాస్, డా.శమంత,రాధిక, కే.గంగాధర్,అర్చన, తెలుగు శాఖ అధ్యక్షులు, ఎన్సిసి అధికారి డా. ఎం. రామస్వామి, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

