29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ముర్రు పాలు తాగించడం బిడ్డకు శ్రేయస్కరం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : ఇప్పుడు పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు తాగించడం బిడ్డకు శ్రేయస్కరమని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమలత పేర్కొన్నారు. మంగళవారం మండలం లోని అన్నారం లోని అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి ఆమె మాట్లాడారు. సూపర్వైజర్ సుమలత మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లను ప్రతి బాలింతలు తల్లులు పిల్లలు సంయోగం చేసుకోవాలని ఆమె కోరారు. మీకోసమే వారానికి రెండుసార్లు బిర్యాని వండి పెడుతున్నాము అంగన్వాడి సెంటర్ కు వచ్చి భోజనం చేసి వెళ్లాలని ఆమె సూచించారు. అంగన్వాడికి వచ్చే పిల్లలను ఆన్లైన్లో పొందుపరచాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ అనురాధ,, ఆశా వర్కర్లు తల్లులు బాలింతలు పిల్లలు పాల్గొన్నారు.

More articles

Latest article