బావిలో పడి ఒకరి మృతి

0 15,549

బతుకమ్మ, భిక్కనూరు : వ్యవసాయ బావి లో పడి చనిపోయిన సంఘటన భిక్కనూరు మండలం లక్ష్మీదేవి పల్లిలో గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీ దేవునిపల్లి కి చెందిన దోమకొండ బాలయ్య(46) ఏనుగు రామిరెడ్డి బావికి సంబంధించిన బావిలో బోరు మోటర్ చెడిపోవడం వల్ల మోటారు తీసే టైం లో ప్రమాదవశాత్తు నీట మునిగి  చనిపోయాడని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దావఖానాకు తరలించినట్లు ఎస్సై  తెలిపారు.

One person dies after falling into a well

Leave A Reply

Your email address will not be published.