24.1 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా  ఆచార్య సిహెచ్ ఆరతి

Must read

📰 Generate e-Paper Clip

 

.. .ఆరతికి నియామక పత్రాలను అందచేసిన రిజిస్ట్రార్ ప్రో యాదగిరి

డిచ్ పల్లి,బతుకమ్మ :

తెలంగాణ వర్సిటీ  ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా   కంప్యూటర్ సైన్స్  ప్రొఫెసర్  సిహెచ్ ఆరతిని  నియమిస్తూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు ఆదేశాల జారిచేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి   నియామకపు ఉత్తర్వులు అరతికి మంగలవారం అందించారు.  ఈసందర్బంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ గతంలో ప్రొఫెసర్ ఆరతి విశ్వవిద్యాలయంలో అనేక అడ్మినిస్ట్రేటివ్ ,అకాడమిక్ పదవులను   సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వహించి అధికారుల మన్ననలు  పొందినారని తెలిపారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి, బోధన బోధనేతర సిబ్బందిని  అధికారులను సమన్వయ పరుచుకుంటూ  అంకితభావంతో పని చేస్తానని  హామీ ఇచ్చారు. తన మీద నమ్మకంతో   నియామకపు ఉత్తర్వులు అందించిన   వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ టీ.యాదగిరిరావుకు, రిజిస్ట్రార్  ప్రొఫెసర్ యాదగిరి కి  కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article