26.3 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థినిని లైంగికంగా వేధించిన లెక్చరర్ పై పోక్సో యాక్ట్ నమోదు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎస్ఆర్ కళాశాల ఎదుట పిడిఎస్ యూ నాయకుల ఆందోళన

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ లో ఎస్ ఆర్ మహిళా కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని లైంగికంగా వేధించిన లెక్చరర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థినిపై వేదింపుల విషయంపై పిడిఎస్ యూ నాయకులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మహిళ జూనియర్ కళాశాలకు వెళ్లి విద్యార్థిని వద్ద వివరాలు సేకరించి మీడియాతొ మాట్లాడుతూ విద్యార్థుల వద్ద లక్షల రూపాయలు  వసూలు చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థల హాస్టల్లో ఇటువంటి ఘటనలకు పాల్పడం సరైనది కాదని అన్నారు. చాలామంది విద్యార్థినీలు చెప్పుకోలేక ఇటువంటి ఘటనల వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. వెంటనే లెక్చరర్ పైన యాజమాన్యం పైన  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు నిఖిల్, నగర నాయకులు దుర్గాప్రసాద్, మనోజ్ తదితదిరులు పాల్గొన్నారు.

More articles

Latest article