24.1 C
Hyderabad
Monday, August 3, 2026

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని మోర్తాడ్ మండలం అధ్యక్షులు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో మున్నూరు కాపు సంఘం వద్ద 5 లక్షల నిధులతో కిచెన్ షెడ్డు నిర్మాణానికి అలాగే ZPHS పాఠశాలలో 4 లక్షల 80000 రూపాయలతో బాలికలు, బాలుర కొరకు టాయిలెట్ల నిర్మాణానికి, గురడి రెడ్డి సంఘం 5 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో చైర్మన్ పాలెపు నరసయ్య, కSC సెల్ మండల అధ్యక్షుడు ఆనంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహిపాల్, గ్రామ అధ్యక్షులు MC గంగాధర్, గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంతోష్, నర్సారెడ్డి, రాజేష్, గంగా నరసయ్య, యూత్ వినోద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article