బతుకమ్మ, ఏర్గట్ల: ఢిల్లీలో జరిగే బిసి ధర్నాకు ఏర్గట్ల మండల కేంద్రం నుండి కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్,ఏఐసిసి తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి కలిసి వెళ్లడం జరిగింది.ఇట్టి సందర్భంలో రేండ్ల రమేష్ ఫోన్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టినటువంటి బిసి ధర్నాకు హైదరాబాద్ నుండి ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ప్రయాణం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశాడు.
