29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తెయూ సౌత్ క్యాంపస్ లో విద్యార్థిని ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల పరిధిలోగల తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో ఎంఏ తెలుగు రెండవ సంవత్సరం చదువుతున్న బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన స్టూడెంట్ అశ్విని (24) క్యాంపస్ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఆదివారం రాత్రి ఏమైందో తెలియదు కానీ హాస్టల్ గదిలోకి గోళ్లెం పెట్టుకొని  ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీని గమనించిన స్నేహితులు క్యాంపస్ సిబ్బంది సహాయంతో  కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో  ఆమెను పరిశీలించిన డ్యూటీ వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దింతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు.

More articles

Latest article