- కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర
ఎల్లారెడ్డి, బతుకమ్మ : సస్పెక్ట్ ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నేరాల తగ్గుదలకు పెట్రోలింగు విజిబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. కార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉండాలన్నారు. అన్ని ప్రార్థన స్థలాలలో, దేవాలయం, బ్యాంకులో సీసీ కెమెరాలు తప్పనిసరని సూచించారు. నేరాల అదుపులకు పటిష్టమైన చర్యలు చేపడుతూ గస్తీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పి యస్.శ్రీనివాస్ రావు, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.

